మీ కొరకు ఒక రక్షకుడు

మీరు సంతోషకరమైన వ్యక్తిగా ఉన్నారా ? లేక భయము మరియు అపరాధ భావము మీ సంతోషమంతటిని హరించుచున్నాయా? మీ అపరాధ భావాన్ని వదిలించుకోవాలని ఆశిస్తున్నారా అయితే ఎలా ? నేను మరలా తిరిగి సంతోషముగా ఉండగలనా అని అనుకొంటున్నారా?

మీ కొరకు నా యెద్ద మంచి వర్తమానము ఉన్నది. మీకు సహాయము చేయుటకు మీ పాపములు క్షమించుటకు మరియు నిత్య ఆనందము ఇచ్చుటకు ఒకరు ఉన్నారు. అయన పేరు యేసు క్రీస్తు ఆయనను గూర్చి మీకు తెలియజేస్తాను. 

లోకమును దానిలోని సమస్తమును దేవుడు ఏర్పరచాడు. నిన్ను మరియు నన్ను అయన ఏర్పరచేను. దేవుడు మనలను ప్రేమించుచున్నాడు. లోకములోని ప్రతి ఒక్కరిని అయన ప్రేమించుచున్నాడు. లోకములోని ప్రతి ఒక్కరిని ఆయన ప్రేమించుచున్నాడు. ఆయన మనల్ని ఎంత ఎక్కువగా ప్రేమించాడంటే తన అద్వితీయ (ఏకైక) కుమారుడైన యేసు క్రీస్తు ఈ లోకమునకు పంపించాడు. యేసు క్రీస్తు ఈ భూమి మీద నివసించినప్పుడు వ్యాధిగ్రస్తులను స్వస్థపరచెను దుఃఖంచుచున్న వారిని ఓదార్చెను. గ్రుడ్డి వాని కన్నులను తెరచెను. అయన అనేక విషయాలను ప్రజలకు భోదించెను. వీటిని గూర్చి బైబులు నందు మనము చదువవచ్చు. 

యేసు క్రీస్తు మన అందరి యెడల తన తండ్రికి ఉన్న గొప్ప ప్రేమను గూర్చి అర్ధము చేసుకోవాలని కోరెను అయన తన తండ్రి యొక్క ప్రేమను విశిధ పరచు ఈ కధను చెప్పెను.

ఒక మనుష్యుడు ఒక గ్రామములో తన ఇరువురి కుమారులతో సంతోషముగా జీవించుచుండెను అయన అంతా చక్కగా సాగిపోవుచున్నదని భావించెను. ఒక రోజు తన కుమారులలో ఒకడు తండ్రిని ఎదిరించి తనకు ఈ గృహము ఇష్టం లేదని తన ఇష్టాను సారముగా జీవించుటకు తన ఆస్తిలో భాగము ఇమ్మని అడిగెను తండ్రికి చాలా దుఃఖము కలిగినను అతనికి భాగము ఇచ్చి పంపివేసెను. తన కుమారుడు ఎప్పటికైనా తిరిగి వస్తాడో లేదో అని అనుకొనెను. ఎందువలన ఆ కుమారుడు తండ్రి అంతగా ఎదిరించెను? 

ఆ కుమారుడు దూర దేశమునకు వేల్లిపోయి తన స్నేహితులతో కలిసి ఆ ధనమంతటిని విలసములాకు ఖర్చుపెట్టి చెడు పనులు చేసి వృదా చేసెను ఒక్కసారిగా ధనమంతయు పూర్తిగా ఖర్చుయిపోయి తన స్నేహితులు తనను విడిచిపోయెంత వరకు చాలా ఆనందకరమైన సమయము గడుపుచున్నానని అనుకొనెను. తర్వాత తాను ఒంటరి వాడై ఇప్పుడు ఏమి చేయవలెనని చింతించెను 

ఆతను ఒక రైతు వద్ద చేరి పందులు మేపుచుండెను. తనకు సరిపడినంత ఆహారము దొరకక పందులు పొట్టుతో ఆకలి తిర్చుకోసాగెను తను చేసిన చెడు కార్యములను తన తండ్రిని ఎలాగు బాధపెట్టేనో ఆలోచించ మొదలుపెట్టి మరింత గందర గోళస్థితికెళ్ళేను.

ఒక రోజు తన యింటిలో ఉన్నప్పుడు ఎంత సుఖముగా ఉండేనో తన తండ్రి ఎంత ప్రేమగాలవడో జ్ఞాపకము చేసుకొనెను అయన బహుగా ఆలోచించ సాగెను నేను నా తండ్రికి ఇదంతయు చేసిన తరువాత తిరిగి అయన యొద్దకు పోగాలనా?అయన ఇంకను నన్ను ప్రేమించునా? నేను ఇక ఎంత మాత్రమూ అయన కుమారుడనిపించుకొనుటకు యోగ్యుడను కాను కనుక తన యింట పనివరిలో ఒకరిగా ఉండనిస్తే చాలనుకొనెను 

తన తండ్రి యింకను తనను ప్రేమించుచున్నాడో లేదో తెలుసుకోవాలని లేచి తన తండ్రి ఇంటికి బయిలదేరి వెళ్ళెను 

ఆ తండ్రి తన కుమారుడు యింటిని విడిచి వేల్లిపోయినప్పటి నుండి తను మరలా తిరిగి వస్తాడేమోనని బహుగా ఎదురు చూచుచుండెను. తరువాత ఒకరోజు దూరముగా ఎవరో వచ్చుట చూసేను అది నా కుమారుడేనా? అయన తన చేతులు చూచి పరుగెత్తుతూ వెళ్ళి తన కుమారుని చేర్చుకొని తప్పిపోయిన నా కుమారుడు తిరిగి దొరికేనని చెప్పెను

మన మందరము ఆ కుమారుని వలె మన పరలోకపు తండ్రిని విడిచి వెళ్ళిన వారమే మనము ఆయనను ఎదిరించి ఆయనకు వెతిరేకముగా చెడు క్రియలు చేసి అయన మనకనుగ్రహించిన ఆశీర్వదములను అవకాశములను వృధా చేసితిమి ఈ రోజు మన పరలోకపు తండ్రి తన చేతులు చాపి మనమంతా తిరిగి రావాలని ఎదురు చూస్తున్నాడు 

మన యెడల క్రీస్తుకు ఉన్న ప్రేమను మనము గ్రహించుచున్నామా? అయన ముప్పై మూడు సంవత్సరాలు భూమి మీద బోధించి తర్వాత దుష్టులు చేత సిలువ వేయబడెను అయన సర్వలోక నివాసుల పాపములకు బలిగా తన రక్తమును చిందించి భయంకరమైన నొప్పిని తిరస్కారమును అనుభవించెను 

మనము మన పాపముల విషయమై పశ్చాతాత్పులమై అయన యొద్దకు వచ్చి క్షమించమని వేడుకొంటే ఆయన తను చిందిం చిన రక్తము ద్వారా మన పాపమంతాతిని కడిగి వేయునుఎంతటి ఆశ్చర్యకరమైన అనుభవము! యేసు క్రీస్తు మనకు సొంత రక్షకుడయ్యను మనము మరుమనస్సు పొంది నూతనమైన పజలైతిమి మన జీవితము కొత్త అర్ధము పొందెను యేసు క్రీస్తు మన పాపపు సిగ్గు భయమును తొలగించి సంతోషము మరియు సమాధానములతో నింపెను.

పరలోకం నీ భవిష్యనిలయం

నీ భవిష్యత్తు మాటేమిటి?

ఈ జీవితానంతరం వేరొక జీవితమున్నదా అనే ఆలోచన లేకుండ ఎవ్వడూ భవిష్యత్తునుగురించి ఊహింపడు. మానవుడు మరణానం తర మేమౌతుందని యోచింపకుండా ఉండడు గాని, ప్రస్తుతపు పనుల ఒత్తిడివల్ల ఆ ఆలోచనలను మనసునుండి తొలగించి మరణం, పర లోకం, నరకం - వీని విచారమును దూరపుకాలానికి నెట్టివేస్తాడు (మత్తయి 24:48, ప్రసంగి 8:11). నిజానికి మానవు డేదోయొక నిర్ణయా నికి రావలెను. ఏదీ లేకుండా వుండడమంటే శాశ్వతంగా నష్టపోవడమే.

మనిషికి రెండే రెండు గతులున్నవి

పరలోకపు ప్రాభవం, లేదా దుష్టకార్యాసక్తులకు ప్రాప్తించు నిరంతర దండనం. బైబిలులో చెప్పినట్లుగా ఈ రెంటిలో మనము పరలోకమునే శాశ్వతముగా ఎంచుకొనవలెను. దీనిని పొందుటకై మనము సరియైన మార్గము నెంచుకొనవలెను. ఎట్టి పాపమూ పరలోకము నంటజాదు; ఇది మాత్రము నిజము. తమ పాపములకు క్షమార్పణము పొందనివారికి నరకములో శాశ్వతమైన శిక్ష పడును. "వీరు నిత్యశిక్షకును, నీతిమం తులు నిత్యజీవితమునకు పోవుదురు" (మత్తయి 25:46, మరియు చూడుడు: మత్తయి 7:21-23).

పాపవిముక్తులందరికి పరలోకము నిలయము

క్రీస్తురక్తములో క్షాళనము చేయబడి పాపవిముక్తులైనవారికి పరలో కము విశిష్టమైన స్థావరము (ప్రకటనలు 7:13-14). ఇది వారి నిలయము. వారికి పరలోకమందు గల కోరిక 63వ కీర్తనలోని మొదటి పాదములో ఆ కీర్తనకర్త కున్నటువంటిది. తృష్ణాపూరితమైన ఎడారిలో అతని ఆత్మ దేవునికై పరితపించెను. మాంసలమైన ఇహలోకపు దేహమునకు పరలోకము బహుదూరము నందున్న నిలయము. పరిశుద్ధాత్మ గల వానికి పరలోకము సన్నిహితమైనది, నిజమైనది. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవునిబిడ్డలో నెలకొనియుండునో అప్పుడతడు ముందుగానే ఆ శాశ్వత నిలయమును చవిజూచును.

క్రీస్తుచేత ఉదాహృతములైన సత్యము, నమ్రత, పవిత్రత, ప్రేమ మొద లైన సద్గుణములు పరలోకమును పొందుటకు విలువైన సోపానశిలలు. అవి దేవునిబిడ్డకు చాలా విలువైనవి. దేవుడు పరలోకమునుండి మాన వుని జీవితమును సఫలము జేయుకొలది అతడు నమ్మకస్థుడును, విన మ్రుడును అగును. ఈజీవితములో నతడు సద్గుణముల బంగారుదారిలో పయనించును. అతని హృదయము ఈ క్రైస్తవానుగ్రహముల పవిత్రతా పరిపూర్ణతలకై పరలోకమును కాంక్షించును (2 ఎఫిసీయులకు 5:1).

పరలోకం తేజోమయం

ఇహలోకమందలి జీవితము నీడల మయము. ఇందులో మనకర్థము కాని విషయము లెన్నో యుండును. భవిష్యత్తులోనికి చూడాలనుకుం టాము గాని చూడలేము. మానవునికి తెలిసిన దెంతయున్నను తెలియ నిది చాలా యున్నది. జీవితంలో తరచుగా నిరాశానిస్పృహలు పొందు తుంటాము. ఇవన్నీ జీవితంలో మన మెదుర్కొనే చీకటి సన్నివేశాలు. 

పరలోకము కేవలము తేజోమయము. దేవు డిచ్చటనే యుండును. "దేవుడు వెలుగై యున్నాడు; ఆయనయందు చీకటి ఎంతమాత్రమును లేదు" (1 యోహాను 1:5). అతని వెలుగులో నిండైన అవగాహన, పరి పూర్ణమైన విజ్ఞానములుండును. కడచిన కాలము, విషయము లన్నియు విస్పష్టముగా నుండును. దేవునిచే రక్షింపబడినవారా వెల్గును చూతురు. దుష్కార్యపరులు చీకటినే ప్రేమింతురు (యోహాను 3:19-21). ఈ వెలు గులో తండ్రికి, అతనితో నుండువారికి పరిపూర్ణమైన సహచారిత్వ ముండును. 

పరలోకము "పరిశుద్ధులకు సంక్రమించిన తేజోమయమైన సొత్తు" గా వర్ణింపబడినది (కొలొస్సీయులకు 1:12). విజ్ఞానము, పవిత్రత, ఆనం దము ఈ తేజస్సు లక్షణములుగా మతగ్రంథములు పేర్కొనుచున్నవి.

పరలోకము భయరహితము, పాపరహితము

"గొఱ్ఱెపిల్లయొక్క జీవగ్రంథమందు వ్రాయబడినవారే దానిలో ప్రవే శింతురు గాని నిషిద్ధమైనదేదైనను, అసహ్యమైనదానిని, అబద్ధమైన దానిని జరిగించువాడైనను అఒదులో ప్రవేశింపనే ప్రవేశింపడు" (ప్రకటన 21:27). నిరుత్సుకత, అసంతృప్తి, వ్యామోహము, పాపము - ఇవి ఈ భూలోకజీవితమందుండును గాని ఆ అందమైన పరలోకము నెప్పుడూ ప్రవేశింపనేరవు. 

"అతడు వారికన్నుల ప్రతిబాష్పబిందువును తుడుచివేయును. మరణము ఇక ఉండదు, దుఃఖమైనను, ఏడ్పైనను, వేదనయైనను ఇక ఉండదు, మునుపటి సంగతులు గతించిపోయినవి" - అని ప్రకటన 21:4 చెప్పుచున్నది. క్రైస్తవునకు పరలోకము సంతృప్తికరమైన అంతిమ గమ్యము. భూలోకములో దేవు డతని కన్నీటిని తుడిచినప్పటికీ, సమస్త మైన శోకము ఆ పరలోకపు పవిత్రతలోనే తొలగింపబడునని అతనికి తెలుసు.

రక్షితుని అమృతత్వము

ఇహలోకములో అన్యోన్యసంబంధముల ప్రాధాన్యత మనకున్నది. పరస్పరానందములు, విచారములు మన మనస్సుల కంటుకొనును. సంసారబాంధవ్యములు అర్థవంతములు, కుటుంబవియోగము బాధా కరము. ఇవన్నీ మరణశీలమైన మన మనుగడకు అవసరమై యున్నవి.

యేసు క్రీస్తు తీర్పు నిచ్చేందుకు తిరిగివచ్చినప్పుడు అందరూ మారిపోతారు. చనిపోయినవారు తిరిగి లేస్తారు, మరణశీలులైనవారు మరణరహితులౌతారు. పాపపంకిలమై మరణశీలమైన దేహము అతని దేహమువలె వెలుగును. "సమస్తమును తనకు లోబరచుకొనజాలిన శక్తిని బట్టి ఆయన మన దీనశరీరమును తన మహిమగల శరీరమునకు సమ రూపముగల దానిగా మార్చును" (ఫిలిప్పీయులకు 3:21). 

ఈ స్థితిలో మన సంసారబాంధవ్యములు మునుపటివలె మన కర్థ వంతములుగా దోచవు. పరలోకములో వివాహబాంధవ్య ముండదని యేసుక్రీస్తు చెప్పెను (మత్తయి 22:30). దేవుని సమక్షములో మనకుండే ఆనందము ముందు ఈ లోకములో మనకున్న వ్యామోహము లెంతో తీసికట్టుగా నుండును. రక్షితులైనవారికి, దేవుని గొఱ్ఱెపిల్లకు మధ్యగల సంబంధము నెట్టి శక్తియూ మచ్చపరుపజాలదు. 

సాధువులు మరణశీలమైన కన్నులెన్నడూ గాంచని విషయము లను కనగలరు.; మరణశీలమైన చెవులెన్నడూ వినని శబ్దములను విన గలరు; మరణశీలమైన హృదయము లెన్నడూ ఊహించని విషయ ముల నూహించగలరు. 

యేసు క్రీస్తు, అతని అభీష్టములే సుప్రశస్తము లగును

ప్రభువైన యేసు భూలోకవాసులందరికి కనపడు కాలము వచ్చు చున్నది. అప్పుడందరూ ఎదుట నిలచి అతనిచే విచారింపబడుదురు. (మత్తయి 25:31-34). ఈ లోకములో నిరాకరింపబడి, నిరసింపబడిన వారైనను, అతని నిజమైన అనుచరులు మహిమాన్వితులౌదురు (పర లోకమున). వారచ్చట నిరంతరముగా దేవునిమహిమను స్తోత్రము చేయ సమర్థులగుదురు. అచ్చట మృత్యువునకు బదులు అమృతత్వము నెల కొనును. "క్షయమైన యీ శరీరము అక్షయతను ధరించుకొనవలసి యున్నది. ఈ క్షయమైనది అక్షయతను ధరించుకొనినప్పుడు - విజయమందు మరణము మ్రింగివేయబడెను అని వ్రాయబడిన వాక్యము నెరవేరును" (1 కొరింథీయులకు 15:54, 2 కొరింథీయులకు 5:1 ను కూడ చూచునది).

సాధువు లీ జీవితములో అనేకములగు సంకటములు, వ్యామోహ ములు, కష్టముల నెదుర్కొందురు. ఉద్ధారకునియందు విశ్వాసముంచి చివరివరకు కొనసాగినవారిని అతని అనుగ్రహము పరలోకమునకు గొనిపోవును. అతనిని విశ్వసించిన అన్ని దేశములవారు, అన్ని భాషల వారు, అన్ని వయస్సులవారు అచ్చట నుందురు. పాపములనుండి క్షమింపబడి, యేసుక్రీస్తు రక్తముచే పరిశుద్ధులైనవారి అసంఖ్యాకమైన గొప్ప బృందము ఈ పరలోకమునందు వసించును (ప్రకటన 7:9-14).

ఈ జీవితములో క్షమింపబడిన ఆత్మలు పరలోకములో సుప్రశస్తము లగును. ఈ ఆత్మలు దేవుని గొఱ్ఱెపిల్లతో వియ్యమందుట ఎంత అద్భు తముగనుండును! ఈ మహిమ అనన్యసామాన్యము (ప్రకటన19:7-9). 

పరలోకం - మానవులకు ఊహాతీతం

"ఇప్పుడు అద్దములో చూచినట్లు సూచనగా చూచుచున్నాము; అప్పుడు ముఖాముఖిగా చూతుము. ఇప్పుడు కొంతమట్టుకే యెరిగి యున్నాను; అప్పుడు నేను పూర్తిగా ఎదుగబడిన ప్రకారము పూర్తిగా ఎరుగుదును" (1 కొరింథీయులకు 13:12).

పరలోకముయొక్క మహత్వవైభవములు పూర్తిగా అవగాహన చేసికొనుటకుగాని, వర్ణించుటకుగాని వీలుపడదు. మనము చూచిన దానిని, అనుభవించినదానిని మాత్రమే మన మనసులు గుర్తించును. ఆత్మ దేవునితోసహా నివసించే లోకమే పరలోకమని మనం గుర్తించి నప్పటికీ, ఆ శాశ్వతనిలయంయొక్క పరిపూర్ణలక్షణాలను అతడు మనకు తెలియజేయుట లేదు.

పరలోకముయొక్క ఈషద్దర్శనములు మతగ్రంథములలో కొద్దిగా పేర్కొనబడియున్నవి. తొట్టతొలిగా ప్రాణత్యాగముచేసిన స్టెఫెన్ అను క్రైస్తవుడు, తన మతవిశ్వాసానికై రాళ్లతో గొట్టబడుచూ "ఆకాశమువైపు నికరముగా దృష్టి నిల్పి, దేవుని మహిమను, యేసు దేవుని కుడిపార్శ్వ మందు నిల్చియుండుటను చూచెను" (అపోస్తలుల కార్యములు 7:55). స్టెఫెన్ పరిశుద్ధాత్మతో నింపబడి, తన భవిష్యనిలయముయొక్క ఈష ద్దర్శనమును పొందెను. 

పరలోకమునుగురించి ఎక్కువగా తెలియకున్నను, మనకు తెలిసి నంత మేరకు, ముందలి తరములందలి విశ్వాసపరులవలె మనమూ భగవన్నిర్మితమైన ఆ శాశ్వతనగరములో నుండ నిచ్చగింతుము. "దేవుడు దేనికి శిల్పయు, నిర్మాణకుడునై యున్నాడో పునాదులుగల ఆ పట్టణముకొరకు అబ్రాహీము ఎదురుచూచుచుండెను" (హెబ్రీయు లకు 11:10, 11:13-16 లను కూడ చూచునది).

మన మక్కడ ఉందుమా?

మరణానంతరము మన మెక్కడికి పోదుము? పరలోమునకు పోదుమా? దైవాత్మ మనలను మెల్లగా తట్టి అట్టి శాశ్వతభవిష్యత్తుకు సిద్ధపడమని గుర్తుచేస్తుంటుంది.

మనం దేవునియొక్క ఆవశ్యకతను గుర్తించవలెను. తన ఆదిమ పతనంవల్ల మానవుడు దేవుని అనుగ్రహమును కోల్పోయెను. మన పాప ములకు పశ్చాత్తాపపడి, క్రీస్తురక్తముద్వారా క్షమింపబడి మన మా దైవ సంబంధమును పునరుద్ధరించుకొనవచ్చును. అప్పుడు దేవుడు మనలను విజాయితీపరులుగా గ్రహించి, క్షమించును. ఇట్లు మనము వాక్కు ద్వారా, ఆత్మద్వారా దేవునిబిడ్డల మగుదుము. (యోహాను 3:5, 1:12). ఇట్లు మనము పొందు శాంతి మునుముందు మనము శాశ్వతలోకములో పొందెడు పరిపూర్ణశాంతికి తొలిరుచిగా నుండును. పరలోకములో తనకై యొక సౌధము సిద్ధపరుచబడినదని ప్రతియొక్కడు తన హృదయంలో స్పష్టమైన సాక్ష్యాధారమును కల్గియుండవచ్చును(యోహాను 14:23).

భయంనుండి విముక్తి

భయమంటే ఏమిటి?

దైవభీతి

భవిష్యత్తును గురించిన భయం

ఓటమిని గురించిన భయం

కష్టాలను గురించిన భయం

మరణభయం

భయమంటే ఏమిటి?

భయమనే ప్రచ్ఛన్నశత్రువు అన్ని వర్గాలవారినీ, అన్ని జాతుల వారినీ, అన్ని వయస్సులవారినీ వెన్నాడుతుంటుంది. ఇది లోలోపల మనలను క్రుంగదీస్తుంది; మన ఆలోచనలను భంగపరుస్తుంది; అంత శ్శాంతిని వమ్ముచేస్తుంది; జీవితేచ్ఛను కూలద్రోస్తుంది. ఇది మనకు తడ బాటును, ఆయాసమును, గాబరాను, కలతను, అవ్యవస్థతను, పిరికిత నాన్ని కలిగిస్తుంది.

మనకు సంఘర్షణ, మార్పు, భంగపాటు, నిరుత్సాహం భయాన్ని పుట్టిస్తాయి. కొందరికి అనారోగ్యం, మనోదేహక్లేశాలు భయం కలిగి స్తాయి. మరికొందరు తమ కాప్తులకు ఆపదలు వస్తాయని భయపడు తారు. కొందరు ఇతరులను, వారి అభిప్రాయాలనుగూర్చి భయం చెందుతారు. ఇంకొందరు చీకటిని, ఒంటరితనాన్నిగూర్చి భయపడు తారు. అన్యులు మరణాన్ని, తెలియనిదాన్నిగూర్చి భయపడతారు. క్రైస్త వులు కొందరు తమకు ముక్తి లభించదేమో యని, దేవుడు తమ పాప ములను క్షమించడేమో యని భయపడుతారు. వారు చావడానికే కాక, బ్రతికియుండటానికి గూడ భయపడుతారు.

భయం ఎంత మెల్లగా, నిశ్శబ్దంగా మనలో ప్రవేశిస్తుందంటే దాని వినాశకరమైన ప్రభావానికి బలియౌతున్నామని మనం గ్రహించలేము. గ్లాసులోని నీటిలో వేసిన చిన్న రంగుచుక్కలాగా కొద్దిపాటి భయమైనా ప్రతిదాన్నీ కలుషితం చేస్తుంది. ఈ చిన్నపాటి భయప్రవాహాన్ని అరి కట్టకపోతే మిగతా ఆలోచనలు దానిలోచేరి అది పెద్ద ప్రవాహమౌతుంది.

జీవితం జటిలమైనది, ప్రపంచం హింసాపూరితమైనది, కాని ఈ బాహిరమైన బాధలు అంతరంగంలోని శాంతిని భంగపరచకూడదు. మన అంతరంగంలోని భయాన్ని మనం ఎదుర్కొనవలెను. మన కతి ముఖ్యమైన అవసరాలు తీరనప్పుడు భయం మనల నావేశించును. దేవుని ప్రతిరూపాలవంటివైన మన ఆత్మలు అతనికై ఘోషించును. మనం దేవునినుండి వైదొలగినచో ఆందోళనలు, చిక్కులు, భయాలు, మనల నావేశించగలవు.

సాతాను మన భయప్రకృతిని చొరవగా తీసికొనును. ప్రతిసారి ఆ భయాల నతడు అధికంచేసి అవి నిజమైనవిగాను, సతార్కికమైనవి గాను ఉన్నట్లుగా భ్రమను కలిగించును. మనం దానినుండి విముక్తి పొంద రానివిధంగా మనమార్గ మంతకంతకు చీకటిమయమూ,మన హృదయ భార మంతకంతకు అధికమూ అగును.

సాతాను అంధకారంలో వర్తించును. అతడు వెలుగులో వర్తింప జాలడు ఎందుకంటే "దేవుడు వెలుగై యున్నాడు. ఆయనయందు చీకటి ఎంతమాత్రమును లేదు" (1 యోహాను 1:5). సాతాను ఎచ్చట మన బల హీనత ఉందో అచ్చట భయాలోచనలను కలుగజేయును. అతడు యథార్థమును తొలగించి, అయథార్థముతో మనల భ్రమపెట్టును. వీనిని మనం మన హృదయపు చీకటిలోతులలో దాచుకొన్నయెడల సాతాను తన దుష్టవర్తనతో భయమును, నిరుత్సాహమును పురికొల్పును. అత నిని వెలుగులోనికి బయలుపరచుట ద్వారా అతని ప్రభావము నరికట్టి అతనిని పారద్రోలవచ్చును.

దైవభీతి

మానవునియొక్క పాపవర్తన తీవ్రమైన భయమును కలుగజేయును. తన నడవడి దేవునికి సంతోషదాయకముగా లేదనునదే ఈ భయము నకు మూలమగును. ఆదాము,హవ్వలు సాతాను మాటలకు లొంగి పోయి తోటలోదున్న చెట్టుఫలములను తినరాదను దేవుని ఆజ్ఞను ధిక్క రించిన ఆరోజు నిజంగా శోచనీయమైనది. అట్లు పాపము చేసి వారు దేవునినుండి దాగికొనిరి. ఆనాటి సాయంత్రము దేవుడు పిలువగా, ఆదాము "నేను తోటలో నీ స్వరమును విని భయపడితిని" అనెను (ఆది కాండము 3:10). ఆదాముమొదలుగా తరతరములపాటు మానవజాతి ఆ పాపపుఛాయలోనే పడియున్నది. దైవభీతివలన మానవుడు తన పాపములకు పశ్చాత్తాపము పొందగల్గినచో అది ప్రయోజనకరమే యగును. "యెహోవాయందలి భయము జ్ఞానమునకు మూలము" (కీర్త నలు 111:10). ఇది వినమ్రతాగౌరవములతో, అద్భుతరసపూర్ణభావనతో కూడినది. ఇట్లు కొంతగా మనము దేవునియొక్క ఘనమైన మహ త్వము, ధర్మశీలత, న్యాయనిర్ణేతృత్వము, ప్రేమ, దయ, విజ్ఞానము, మఱియు సనాతనత్వములను చూతుము. అతడు సర్వజ్ఞుడు, సర్వ శక్తుడు, సర్వాంతర్యామి. మన యునికి అతనిపై ఆధారపడియున్నది, మన మతని సృష్టి, అతడు మన సృష్టికర్త. ఇట్టి దేవుని అసంతుష్టి పరచుటకు మనము వెరచెదము. దేవుని ధర్మశీలత పాపులను ఘోర నరకజ్వాలలయందు మ్రగ్గజేస్తుందని మనకు తెలుసు. "మనము సత్య మునుగూర్చి అనుభవజ్ఞానము పొందిన తరువాత బుద్ధిపూర్వకముగా పాపము చేసినచో పాపములకు బలి యికను ఉండదుగాని న్యాయపు తీర్పునకు భయముతో ఎదురుచూచుటయు, విరోధులను దహింప బోవు తీక్ష్ణమైన అగ్నియు నికను ఉండును" (హెబ్రీయులకు 10:26,27). ఇట్టి జ్ఞానము పాపభీతిని కల్పించును. మన పశ్చాత్తాప, క్షమాపణ, విధేయతల ద్వారా దేవుని మనయొక్క వ్యక్తిగతస్నేహితునిగా నెంచు కొనగల్గినకొలది మన మతనికి జేయు సేవ దైవభీతి, ప్రేమ, అతని ముక్తి దాతృత్వమునకు గల కృతజ్ఞతాభావములతో గూడియుండును. "ప్రేమ యందు భయముండదు; అంతే కాదు. పరిపూర్ణప్రేమ భయమును వెడల గొట్టును. భయము దండనతో గూడినది. భయపడినవాడు ప్రేమయందు పరిపూర్ణము చేయబడినవాడు కాడు" (1 యోహాను 10:18). దైవభీతి మన హృదయములలో వెఱపును నింపదు, కాగా దేవునియందలి ప్రేమను ప్రగాఢమొనరించును. ఈ భయము మన మనుగడలో పరిపూర్ణ ముగా నెలకొన్నచో నిది ఇతరభయముల నన్నిటిని పారద్రోలును. మఱి యెందుకు భయమేఘములు చాలామంది లోకుల హృదయాల నావరించి, వారి మనస్సులను కలతనొందించుచు, వారి జీవనపథముపై ప్రభావమును చూపుచున్నవి? దేవుని మార్గమే శాంతిప్రదము, విశ్వస నీయమైనట్టిది.

ఒకానొక బాలుడు ఒంటరిగా చీకటిరాత్రిలో నడవడానికి భయపడ్డా డట గాని, తండ్రి తోడుగా నడచి చేయూతనిస్తే వాని భయం తొలగి పోయిందట! చీకటంటే అతని కిప్పుడు భయం లేదు ఎందుకంటే తండ్రిపై అతనికి ప్రేమవిశ్వాసాలున్నాయి; తనతండ్రి తనను కాపాడుతాడని అతనికి తెలుసు. ఇందులోనే భయవిముక్తికి గావలసిన కిటుకున్నది; మన తండ్రియగు దైవమును మనము బాగుగా తెలిసికొనవలెను. మనం దేవుని నమ్మినకొలది మన జీవితముల నతని కాయత్తము చేసి, మన చేతి నతని చేతిలో భద్రముగా నుంచుతాము. మన మనస్సులను వేధించే ప్రశ్న లను,మన జీవనక్లేశాలను వినమ్రతతో నతనిముందు మనముంచుతాము.

క్రీస్తుచే నాజ్ఞాపింపబడి గాలికి రేగిన గలీలిసముద్రపుటలలపై నడచిన అపోస్తలు పేతరు దీనికొక ఉదాహరణము. పేతరు ప్రభువుపై చూపులు నిలిపినంతవరకు భయపడలేదు గాని, అలలపై చూపులు నిలుపగనే భయపడి నీటిలో మునుగసాగెను (మత్తయి 14:24-31). మనం భయం నుండి విముక్తి గోరి దేవునిపై నమ్మకముంచినచో అతని ఆత్మ మనతో నిశ్చలమైన సూక్ష్మస్వరముతో పలుకును. భయంవైపు చూచే బదులు అతనివైపు చూచిన మనలను చుట్టుకొన్న కలత అణగిపోవును. అప్పు డతడు మన సందిగ్ధమైన ప్రశ్నలకు ఉత్తరము నొసగి, మన అనుమాన ములకు బదులుగా అభయము నొసగి, మన హస్తము నతని చేతిలో నెమ్మదిగా గ్రహించును. అతని అనుగ్రహముతో భయముయొక్క హాని కరమైన పరిణామములను మనం అధిగమించవచ్చును.

భవిష్యత్తును గుఱింనిన భయం

దురవగాహమైన భవిష్యత్తు రూపం కొందరిని కలవరపెడుతుంది. నిదురలేచి నప్పటినుండి ఏమి జరుగుతుందో తెలియకుండా వారుం టారు. ఎప్పు డేమౌతుందో అనే అనుమానంతో వారూహాజనితభయం యొక్క చీకటికోనలలో సంచరిస్తుంటారు. "దేనినిగూర్చియు చింత పడకుడి గాని ప్రతివిషయములోను ప్రార్థన విజ్ఞాపనములచేత కృత జ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి" (ఫిలి ప్పీయులకు 4:6). భవిష్యత్తును దేవుని చేతులలో నుంచి, దురవగాహ మైన అజ్ఞాతవిషయముల భారము నతని కప్పగించవచ్చును. ఇట్లొక మారు చేసి చూడండి, మీకే తెలుస్తుంది!

జీవితలక్ష్యమును తెలియకుండుటచే చాలామందికి భవిష్యత్తు భయం కరముగా తోచును. ముందు కెటుపోవలెనో ఎరుగక వారు భయ గ్రస్తు లగుదురు. జరుగబోవు విషయములు దేవునికి తెలియును గనుక, అతనిని మార్గదర్శిగా నంగీకరించిన, వారి ప్రయాణములు నిరర్థకము గాక వారు సరియైన గమ్యమునకు చేరుదురు.

అజ్ఞాతమైన భవిష్యత్తు నెదుర్కొనుచున్నను తనను నమ్మినవారి యెడల నమ్మకముగా నుందునని దేవుడు ప్రమాణముచేసెను. నీవిది నమ్ముదువా? తుఫాను ఎంత తీవ్రముగా నున్నను, రాత్రి ఎంత చీకటిగా నున్నను, పర్వతము లెంత ఉన్నతముగా నున్నను, అతడు నిన్ను కచ్చితముగా ఇంటికి చేర్చును.

ఓటమిని గుఱించిన భయం

మనమేదో సాధించవలె ననుకొందుము, కాని ఆది భంగమౌతుందో అనే భయం - మనలను, మన కుటుంబాలను, చివరికి మన జీవితాలనే పీడిస్తుంటుంది. మనం తప్పుడుదోవను ఎన్నుకున్నామో అని, తప్పుడు విధానాన్ని అనుసరిస్తున్నామో అని భయపడతాము.

దేవుడు యెహోషువ నిట్లు ఆజ్ఞాపించెను - "నిబ్బరము గలిగి ధైర్య ముగా నుండుము, దిగులు పడకుము, జడియకుము. నీవు నడచు మార్గ మంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడైయుండును" (యెహోషువ 1:9). మనం మన జీవితాలను ఆస్వామియొక్క మార్గదర్శకత్వములో నుంచినచో, పూర్వవైఫల్యాలు తుది నిర్ణయాలు గాక, మునుముందు సాఫల్యత కవి సోపానములు కాగలవు.

కష్టముల గుఱించిన భయం

మనం శారీరరకబాధలపట్ల, విమర్శలవల్ల కల్గిన గాయములపట్ల భయంతో కుంచించుకపోతాము. దేవుడు అన్ని బాధలనుండి మనలను కాపాడలేడు గాని, ఆ బాధలను ఓర్చుకొను శక్తిని అనుగ్రహించును. మన బాధల మధ్య నతడు శాంతిని, ఊరటను ప్రసాదించును. "దేవుడు మనకు ఆశ్రయము మార్గమునై యున్నాడు. ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. కావున మనము భయపడము" (కీర్త నలు 46:1,2). మనము ప్రభువును నమ్మినచో అతడు బాధలను మన మంచికే ఉపయోగించును. బాధలు దేవుని అస్తిత్వమహత్వములను ఎత్తిచూపుట కవకాశ మొసగును. అవి గాఢమైన నైజమును, అవగాహన చేసికొను హృదయమును పెంపొందించును. బాధలు మనకు పతనము గూర్పవచ్చును, లేదా ప్రయోజనమైన చేయవచ్చును. వీనిలో మీకేది చేకూరుతున్నది?

మరణభయం

మానవజాతికి మరణభయం సర్వసాధారణం. ఈ ప్రపంచానికి వీడ్కోలు చెప్పడం చాల కష్టమైన పని.

మన మీ చిరకాలపు ప్రశ్న నెదుర్కొనవలెను - "మరణమైన తరు వాత నరులు బ్రతుకుదురా?" (యోబు 14:14). ఏసు మనలను మరణ భయమునుండి తప్పించుటకు వచ్చెను (హేబ్రియులు 2:14,15). అందుకే అతడు మరణించి పునరుత్థానమును చెందెను, అందుకే అతడు "నేను జీవించుచున్నాను గనుక మీరును జీవింతురు" (యోహాను సువార్త 14:19) - అని చెప్పెను. అతని ప్రకారము మరణమనేది శూన్యం లోనికి దారి గాదు సరి కదా క్రొత్త జీవితంలోనికి తెరచిన ప్రకాశవంతమైన ద్వారము. "మీ హృదయమును కలవరపడనియ్యకుడి....నా తండ్రి యింట అనేకనివాసములు కలవు .... మీకు స్థలము సిద్ధపరుచ వెళ్లు చున్నాను" (యోహాను సువార్త 14:1,2) అది సిద్ధపడిన జనులకు సిద్ధ పరచబడిన స్థలము.

నీవు సిద్ధముగా నున్నావా? నీవు నీ పాపపుజీవితమునకు పశ్చాత్తా పము చెందినావా? పశ్చాత్తాపము లోగటి పాపములపట్ల ఏవగింపును కల్గించి వానినుండి బుద్ధిని మరలించును. నీవు నీ అక్కరలయొక్కయు, దుఃఖములయొక్కయు, భయములయొక్కయు భారమును దేవువిపై మోపుచు అతని ప్రార్థించి ఎన్నాళ్లైనది? యేసు అంటాడు - " ప్రయాస పడి భారము మోయుచున్న సమస్తజనులారా! నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును" (మత్తయి 11:28). ఎంత గొప్ప ఆహ్వా నము! ఎంత గొప్ప వాగ్దానము!

రమ్ము - నమ్మికతో, ప్రార్థనతో, ప్రత్యాశతో, నీవు మనశ్శాంతిని పొందుదువు.

రమ్ము - నీవు ప్రశాంతజీవితముయొక్క సరసమైన ఆనందములను గందువు. యేసు క్రీస్తును నమ్ముకొని భయవిముక్తుడవు కమ్మని నిన్ను దేవుడు కోరుచున్నాడు - రమ్మింక!