వ్యాకులితప్రపంచంలో మనశ్శాంతి

Peace

"శాంతి - శాంతి యెక్కడుంది - మన రాష్ట్రాలకు, మన యిండ్లకు, ముఖ్యంగా మన మనస్సులకూ?" ఈ ఆర్తనాదం తరతరాలపాటు ప్రతి ధ్వనిస్తూనే వుంది గాని ప్రపంచం మఱింత వ్యాకులితమై, భయగ్రస్తమైన కొద్దీ ఈ స్వరం ప్రగాఢంగా వినిపిస్తూ వుంది. నీ హృదయంగూడ ఇట్లే ఘోషిస్తున్నదా? ఈ అసంతృప్తి, కల్లోలాల వలయంలో నీ హృదయం వీని నధిగమించిన అంతశ్శాంతికొరకు తపిస్తున్నదా?

ప్రపంచాన్ని సురక్షితంగాను, మంచిగాను చేయడానికి ఉద్యమిం చిన కార్యాలు జీవితాన్ని మరింత క్లిష్టంగాను, జటిలంగాను చేసినవి. చాలా విషయాలలో తల్లిదండ్రులకంటె తమ జీవితములు మెరుగుగా నున్నను కలవరము నెలకొనియున్నది. ప్రజలు పరిశ్రాంతులు, చింతా పరులై యున్నారు. నిస్సందేహంగా సన్మార్గసూచనకు, భద్రతకు, ఆత్మవిశ్వాసానికి కావలసిన యత్న మావశ్యకమై యున్నది. మనకు మనశ్శాంతి ఆవశ్యకమూ, అవసరమై యున్నది.

మనశ్శాంతి - ఎంతటి భాగ్యం? ఇంత నిరాశావైరుధ్యాలమధ్య, చింతావ్యాకులతలమధ్య ఈ భాగ్యాన్ని మనం చూడగలమా?

దీని పూర్తి వచనం: వ్యాకులితప్రపంచంలో మనశ్శాంతి

ఆ మహాన్వేషణ కొనసాగుతూనే వుంది. ఎంతోమంది కీర్తిలో, సంప దలో, విలాసాలలో, అధికారంలో, చదువులో, విజ్ఞానంలో, వివాహంలో మానవసంబంధాలలో ఈ శాంతికై వెదకుతున్నారు. వారు తమ మెద డును విజ్ఞానంతో, పర్సులను ధనంతో నింపుకొంటున్నారు గాని వారి ఆత్మలు ఖాళీగా నున్నవి. కొందరు మత్తుమందులతో, సారాతో జీవితం లోని యాథార్థ్యాన్ని తప్పించుకొనడానికి చూస్తారు గాని శాంతి వారికి అందరానిదే ఔతుంది. వారి అన్వేషణ ఆశాభంగాన్ని, అసాఫల్యాన్నే కలిగిస్తుంటుంది. వారింకా ఏకాకిగానే, శూన్యాత్మలతోనే కలతనొందిన హృదయాలతో ఈ కలతనొందిన ప్రపంచంలో వుంటారు.

చాలామంది అనుభవింపదగిన బాహిరవస్తువులనే చూస్తారు గాని అంతర్దర్శనమును చేసికొనరు. అట్లు చూచుకుంటే ఏం కనపడుతుందో అని వారి భయం. వారి కలతనొందిన మనస్సులకు కలతనొందిన ప్రపం చాన్ని నిందిస్తారు గాని దానికి విరుగుడు అంతర్దర్శనం చేసికొనడమే. 

మానవుడు సంక్షోభంలో ఉన్నాడు

దేవుడు మానవుని సృష్టించి, పరిపూర్ణమైన శాంతిని, సంతోషాన్ని, ఆనందాన్ని పొందడానికి అతణ్ణి ఒక అందమైన ఉద్యానవనంలో ఉంచి నాడు. కాని ఆదాము, హవ్వలు దేవుని ధిక్కరించినంతనే వారికి అప రాధచింతన కల్గెను. మునుపు దేవుని సాన్నిధ్యమును కోరిన వారిప్పుడు సిగ్గుపాటును పొందిరి. మునుపటి శాంతిసంతోషములకు బదులుగా ఇప్పుడు అపరాధచింతన, భయములు వారికి కల్గెను. ఇదే ప్రపంచసంక్షో భ మునకు, మనస్సంక్షోభమునకు నాంది యయ్యెను.

ఆదాము, హవ్వలవలె నీవు దేవునినుండి వైదొలగినచో నీ జీవితము భయసంక్షోభముల మయమగును. జీవితంలోని సందిగ్ధతపైన, మారు తున్న, క్షయమౌతున్న ప్రపంచంపైన నీ దృష్టిని నిల్పినచో అది నీ భద్ర తను, మనోధైర్యమును క్రుంగదీయును. నీ శాంతి భగ్నమగును. 

పాపము దేవునినుండి మానవుని వేరుచేసెను. "మనమందరము గొఱ్ఱెలవలె త్రోవ తప్పిపోతిమి"(యెషయా 53:6)."అందరును పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేక పోవుచున్నారు" (రోమా 3:23). అపరాధచింతన, భయము, రోషము, క్రోధము, స్వార్థ పరత్వము మున్నగు విరుద్ధప్రకృతులు మానవుని అతడున్న చోటులం దెల్ల క్రుంగదీయును. అవి ఆయాసమును, మనఃక్షయమును కల్పిం చును.

స్వార్థప్రేమ తొట్టతొలి ధిక్కారమునకు మూలకారణమయ్యెను. ఇది నిన్ను నిరాశా, మనోవేదనల మార్గమునకు గొనిపోవు దురభిలాష లలో నొకటిగా ఉంటూనే ఉన్నది. నీవు స్వార్థైకప్రయోజనమునే కోరు కుంటే నీకు దిగులు, విచారములు కలుగుతాయి. నీవీ మార్గంలో పయ నించినకొద్దీ నీ సంక్షోభం అధికమౌతుంటుంది.

దైవము కేంద్రంగా గల జీవితమే శాంతి నిస్తుంది

సమస్తమైన ఉనికికి నీవే కేంద్రమని భావించకుండా నీ దృష్టిని దేవుని వైపు మళ్లించి, దేవుని నీ జీవితానికి కేంద్రంగా చేసికొనవలెను. దేవుడు కేంద్రంగా లేకుంటే నీవు సులభంగా కొద్దిపాటిదానికే కలవరపడడం, నీపై నీవు జాలిగొనడం, ఆదుర్ద, భయంవంటివానికి పాల్పడడం జరుగు తుంది. దేవుడు కేంద్రంగా వుంటే బండికుండనుండి ఆకులు విస్తరించి నట్లు ఆకేంద్రంనుండే నీ ప్రవృత్తులన్నీ విస్తరించి నీ జీవితాన్ని పరి పూర్ణంగానూ సార్థకంగానూ చేస్తాయి. దేవుడు కేంద్రంగా గల హృద యమే నెమ్మదిగానూ, ప్రశాంతంగానూ ఉంటుంది.

"నా హృదయము నిబ్బరముగా నున్నది. దేవా ! నా హృదయము నిబ్బరముగా నున్నది నేను పాడుచు స్తుతిగానము చేసెదను-" అని కీర్తనకారుడు ఘోషిస్తాడు (కీర్తనలు 57:7). అతడు దేవుణ్ణి పరిపూ ర్ణంగా విశ్వసించి మనఃప్రశాంతతను పొంది ఆనందించాడు. మన హృద యాలను దేవునిపై మోపి బాహిరమైన బాధలమధ్యలోనూ ఆంత శ్శాంతిని పొందవచ్చును. "ఎటుబోయినను శ్రమపడుచున్నను కలత నొందని వారము.....పడద్రోయబడినను నశించువారముగాము" (2 కొరింథీయు లకు 4:8).

యేసు క్రీస్తే శాంతికారకుడు

అర్థవంతమైన జీవనపరివర్తనకై యేసు క్రీస్తు అందరినీ ఆహ్వా నించును. "ఎవడైనను నన్ను వెంబడింపగోరిన యెడల, తన్ను తాను ఉపేక్షించుకొని, తన సిలువ నెత్తికొని నన్ను వెంబడింపవలెను." (మత్తయి 16:24). "అందుచేత ఎవడైనను క్రీస్తును పొందినచో అతడు క్రొత్తవాడగును. పాతవన్నీ తొలగిపోయినవి. చూడుడు! అన్నీ క్రొత్త వైనవి" (2 కొరింథీయులకు 5:17). మఱి "నాకడకు రమ్ము!" అనే అతని ఆహ్వానము నీవంగీకరింతువా? అతడు చీకటికి బదులు వెలుగునూ, అనుమానమునకు బదులు నమ్మికనూ, సంక్షోభమునకు బదులు శాంతినీ, విచారమునకు బదులు ఆనందమునూ, ఆయాసమునకు బదులు నిలుకడనూ, నిరాశకు బదులు ప్రత్యాశనూ, మరణమునకు బదులు జీవితమునూ ప్రసాదించును. 

దేవుడు మానవుని సజీవమైన ఆత్మతో చేసెను. ఆ ఆత్మ తన నిర్మాత సాహచర్యము నభిలషించును. "దుప్పి నీటివాగులకొరకు ఆశపడు నట్లు దేవా, నీకొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. జీవముగల దేవునికొరకు తృష్ణగొను చున్నది. " (కీర్తనలు 42:1,2) జీవముగల దేవుడే ఆత్మను తృప్తిపరుచ గలడు. నీవు శాంతముతో దేవుని నాశ్రయించనిదే నీకు శాంతి దొరుకదు.

మన హృదయాలయందలి సంఘర్షణ

మన ఆత్మ దేవునికై పరితపించినా, మన పాపప్రవృత్తు లాతని మార్గ ములను ప్రతిఘటించును. మనలో కొంతభాగము దేవుని కోరిననూ మఱి కొంతబాగము దైహికసుఖములను గోరును. ఈ రెండింటి సంఘర్షణల స్థానం మన హృదయం. ఈ అంతస్సంఘర్షణవల్ల ప్రయాస, ఆ ప్రయాసవల్ల వైకల్యమూ కలుగుతాయి. "భక్తిహీనులు కదలుచున్న సముద్రమువంటి వారలు. అది నిమ్మళింపనేరదు. దాని బలములు బుర దను, మైలను పైకివేయును." (యెషయా 57:20).

మన జీవితమంతా - మనస్సు, దేహము, బుద్ధి- ఇవి వాని నిర్మాత చేత సమన్వయము చేయబడనిదే మనకు శాంతి దొరకదు. అతడు సమస్తప్రపంచమునకూ స్వామియే కాక మనందఱి జీవితాలనూ ఆద్యం తముగా నెరుగును. "చీకటిలోను, మరణచ్ఛాయలోను కూర్చుండు వారికి వెలుగునిచ్చుటకై, మన పాదములను సమాధానమార్గములో నడి పించుటకై" అతడీ ప్రపంచములోనికి వచ్చినప్పుడు మనందరిని గుఱించి యోచించుచుండెను (లూకా 1:79).

శాంతిరాకుమారుడైన అతడు నిన్ను చెంతకు రమ్మని ఆహ్వానిం చును. "ప్రయాసపడి భారము మోసికొనుచున్న సమస్తజనులారా! నా యొద్దకు రండి. నేను మీకు విశ్రాంతి కలుగజేతును." (మత్తయి 11:28). నీవతనిని చేరవచ్చినచో అతడొసగు స్వేచ్ఛలో నీవు నెమ్మదిని, ఊర టను పొందుదువు. నీ శాంతి నదివలె (యెషయా 48:18) - ఉజ్జ్వలమై, చైతన్యవంతమై, బలిష్ఠమై, ఆహ్లాదకరమై సమస్తజ్ఞానమును అధిగమించి నదై - ఉండును. (ఫిలిప్పీయులకు 4:7). నీ భారమును క్రీస్తుపై మోపి, నీవతనిని చేరవచ్చెదవా? అతడనును - "శాంతి మీ కనుగ్రహించి వెళ్లుచు న్నాను; నా శాంతినే మీ కనుగ్రహించుచున్నాను... మీ హృదయము లను కలవరపడనియ్యకుడి, వెరవనియ్యకుడి" (యోహాను 14:27).

విశ్వాసము, నమ్మిక భయమును, కలవరపాటును నివారించు మందులు. సనాతనుడైన దైవమును నమ్ముకొని నెమ్మదిని గనుట, ఎన్నడూ మారని, ఎప్పుడూ నశించని ప్రేమ గల అతని మైత్రిని పొందుట ఎంత భాగ్యము! ఈ మిత్రుడు మనకై ఎప్పుడూ చింతించుచుండును; మనల నెప్పుడూ రక్షించుచుండును. అందుచేత సంతాపము, ఆతురత లెందుకు? "ఆయన మిమ్మునుగూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయనమీద వేయుడి" అని 1 పేతరు 5:7లో చెప్పి నట్లుగా చేయుట నేర్చుకొనుడి. ఈ సంఘర్షణ ముగిసిన పిదప శాంతి గలదు గనుక ఆ ప్రభువుకు శరణు జొచ్చుడి. గుర్తుంచుకొనుడి - మీ రతనిని నమ్మిన మీకు విచారముండదు, మీకు విచారముండిన నమ్మక ముండదు. "ఎవని మనస్సు నీమీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతిగలవానిగా కాపాడుదువు. ఏలయనగా అతడు నీయందు విశ్వాస ముంచియున్నాడు" (యెషయా 26:3). 

ఉక్రోషము నీ చిత్తశాంతిని నష్టపరచు విషము. ఇది నిరుత్సాహము నకు నిరాశాపూరితవైకల్యమునకు దారితీయును. నీకు అన్యాయము చేసిన వారిని క్షమించుట కష్టం, కాని నీవు క్షమింపబడవలెనంటే, నీవు ఇతరులను క్షమింపవలెను. "మీరు మనుష్యుల అపరాధములను క్షమిం చనియెడల, మీ తండ్రియు మీ అపరాధములను క్షమింపడు" (మత్తయి 6:15). విశ్వాసము నీ యెదలో కల్గుటచేత నీవు శరణుపొందగలవు. ఉక్రో షము, చిరాకులకు బదులు నీ హృదయం దయాప్రేమలతో నిండి, నీవు అంతశ్శాంతిని అనుభవిస్తావు. యేసు నీ హృదయాధిపతియైనపుడు నీవు నీ విరోధులను ప్రేమిస్తావు. కేవలం క్రీస్తుయొక్క విమోచనకరమైన రక్తమువల్లనే ఇది జరుగగలదు.

పాపముల నంగీకరించుట, పశ్చాత్తాపపడుటవల్ల మనశ్శాంతి కల్గును

మునుపటి పాపముల భారము నిన్ను క్రింగదీయుచుండవ చ్చును, అది దుర్భరము కావచ్చును. అపోస్తలుల కార్యములు 3:19లో ప్రభువు వీనికి విరుగుడు నిస్తాడు- "అందుచేత ప్రభువు సముఖమునుండి విశ్రాంతి కాలములు వచ్చునపుడు మీపాపములు తుడిచివేయబడి, మీ మన స్సులు మార్చబడునట్లుగా పశ్చాత్తాపము నొందుడు." మఱియు, "మన పాపములను మనము ఒప్పుకొనినయెడల, ఆయన నమ్మదగిన వాడును, నీతిపరుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్తదుర్నీతులనుండియు మనలను పవిత్రులుగా చేయును" - అని 1 యోహాను 1:19 చెప్పుచున్నది. ఇట్లు ప్రభువైన యేసుక్రీస్తుద్వారా నీవు దేవునితో సమాధానము కలిగియుందువు (రోమా 5:1).

23వ కీర్తనలో దావూదు దేవునిపై తనకు గల నమ్మకమును వచిం చును. తాను పొందిన సమాధానమును ఇందులో నతడు సవిస్తరముగా వర్ణించును. ఇట్టి సమాధానసాహచర్యములు ఆ గొఱ్ఱెలకాపరితో నుండ గోరు వారందఱికీ ప్రాప్తించును.

23వ కీర్తన

"యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. పచ్చికగల చోట్లను ఆయన నన్ను పరుండజేయుచున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. నా ప్రాణమునకు ఆయన సేద దీర్చుచున్నాడు. తన నామమునుబట్టి నీతిమార్గములలో నన్ను నడిపించుచున్నాడు. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. నీవు నాకు తోడై యుందువు. నీ దుడ్డు కఱ్ఱయు, నీ దండమును నన్ను ఆదరించును. నా శత్రువులయెదుట నీవు నాకు భోజనము సిద్ధపఱచుదువు. నూనెతో నా తల అంటియున్నావు. నా గిన్నె నిండి పొర్లుచున్నది. నేను బ్రదుకు దినములన్నియు కృపా క్షేమములే నా వెంట వచ్చును. చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసెదను."

నీవీ కాపరి నెరుగుదువా? నీవతనిని నమ్ముదువా, విశ్వసింతువా? యెషయా ఈ దయార్ద్రుడైన కాపరినిగూర్చి తెలుపును - "గొఱ్ఱెల కాపరివలె ఆయన తన మందను మేపును. తన బాహువులతో గొఱ్ఱె పిల్లను కూర్చి రొమ్మున ఆనించుకొని మోయును" (యెషయా 40:11). నీవు అయోమయంలోనుంచి దేవునియొక్క ప్రశాంతమైన బాహువుల చే నెత్తబడుటకు సిద్ధముగా నున్నావా? నీవు నీ మునుపటి పాపము లను, ప్రస్తుతవ్యామోహములను, భవిష్యపు భయములను అతని కప్ప గించి పరిపూర్ణముగా నతని శరణుజొచ్చుటకు సిద్ధముగా నున్నావా? దేవుడు నీకీ యవకాశము నిచ్చును. దానిని కోరుకొనుట నీ యిష్టము.

స్థిరమైన శాంతి

పరిపూర్ణహృదయంతో నీవు యేసుక్రీస్తును చేరినప్పుడు నీవు మన శ్శాంతికై చేయు అన్వేషణ అంతమగును. కేవలం అతనిని నమ్ము కొనుటవల్లనే కలుగు శాంతి నతడు ప్రసాదించును. అప్పుడు నీవీ రాల్ఫ్ స్పాల్డింగ్ కుష్మన్ అను కవి వ్రాసిన పద్యంతో నేకీభవింతువు.

"శాంతి లేనిచోట గలదు శాంతి నాకు,
దొమ్మిగాలికి బదులు నిమ్మళంబు,
స్వామితోడ నేకాంతవాసంబు సేయ
గలుగు గుప్తస్థలమొకటి కంటి నిపుడు"

ఈ వ్యాకులితప్రపంచంలో నీవు మనశ్శాంతిని కనగలవు. నీ హృదయ కవాటమును క్రీస్తుకై తెరువుము - ఇప్పుడూ - మునుముందూ అతడు పరిపూర్ణమైన, శాశ్వతమైన శాంతిగల పరలోకకవాటమును నీకై తెరువ గలడు.

మమ్మల్ని సంప్రదించండి

కర పత్రాలను ఆర్థరు చేయండి.