పరలోకం నీ భవిష్యనిలయం
నీ భవిష్యత్తు మాటేమిటి?
ఈ జీవితానంతరం వేరొక జీవితమున్నదా అనే ఆలోచన లేకుండ ఎవ్వడూ భవిష్యత్తునుగురించి ఊహింపడు. మానవుడు మరణానం తర మేమౌతుందని యోచింపకుండా ఉండడు గాని, ప్రస్తుతపు పనుల ఒత్తిడివల్ల ఆ ఆలోచనలను మనసునుండి తొలగించి మరణం, పర లోకం, నరకం - వీని విచారమును దూరపుకాలానికి నెట్టివేస్తాడు (మత్తయి 24:48, ప్రసంగి 8:11). నిజానికి మానవు డేదోయొక నిర్ణయా నికి రావలెను. ఏదీ లేకుండా వుండడమంటే శాశ్వతంగా నష్టపోవడమే.
మనిషికి రెండే రెండు గతులున్నవి
పరలోకపు ప్రాభవం, లేదా దుష్టకార్యాసక్తులకు ప్రాప్తించు నిరంతర దండనం. బైబిలులో చెప్పినట్లుగా ఈ రెంటిలో మనము పరలోకమునే శాశ్వతముగా ఎంచుకొనవలెను. దీనిని పొందుటకై మనము సరియైన మార్గము నెంచుకొనవలెను. ఎట్టి పాపమూ పరలోకము నంటజాదు; ఇది మాత్రము నిజము. తమ పాపములకు క్షమార్పణము పొందనివారికి నరకములో శాశ్వతమైన శిక్ష పడును. "వీరు నిత్యశిక్షకును, నీతిమం తులు నిత్యజీవితమునకు పోవుదురు" (మత్తయి 25:46, మరియు చూడుడు: మత్తయి 7:21-23).
పాపవిముక్తులందరికి పరలోకము నిలయము
క్రీస్తురక్తములో క్షాళనము చేయబడి పాపవిముక్తులైనవారికి పరలో కము విశిష్టమైన స్థావరము (ప్రకటనలు 7:13-14). ఇది వారి నిలయము. వారికి పరలోకమందు గల కోరిక 63వ కీర్తనలోని మొదటి పాదములో ఆ కీర్తనకర్త కున్నటువంటిది. తృష్ణాపూరితమైన ఎడారిలో అతని ఆత్మ దేవునికై పరితపించెను. మాంసలమైన ఇహలోకపు దేహమునకు పరలోకము బహుదూరము నందున్న నిలయము. పరిశుద్ధాత్మ గల వానికి పరలోకము సన్నిహితమైనది, నిజమైనది. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవునిబిడ్డలో నెలకొనియుండునో అప్పుడతడు ముందుగానే ఆ శాశ్వత నిలయమును చవిజూచును.
క్రీస్తుచేత ఉదాహృతములైన సత్యము, నమ్రత, పవిత్రత, ప్రేమ మొద లైన సద్గుణములు పరలోకమును పొందుటకు విలువైన సోపానశిలలు. అవి దేవునిబిడ్డకు చాలా విలువైనవి. దేవుడు పరలోకమునుండి మాన వుని జీవితమును సఫలము జేయుకొలది అతడు నమ్మకస్థుడును, విన మ్రుడును అగును. ఈజీవితములో నతడు సద్గుణముల బంగారుదారిలో పయనించును. అతని హృదయము ఈ క్రైస్తవానుగ్రహముల పవిత్రతా పరిపూర్ణతలకై పరలోకమును కాంక్షించును (2 ఎఫిసీయులకు 5:1).
పరలోకం తేజోమయం
దీని పూర్తి వచనం: పరలోకం నీ భవిష్యనిలయం
ఇహలోకమందలి జీవితము నీడల మయము. ఇందులో మనకర్థము కాని విషయము లెన్నో యుండును. భవిష్యత్తులోనికి చూడాలనుకుం టాము గాని చూడలేము. మానవునికి తెలిసిన దెంతయున్నను తెలియ నిది చాలా యున్నది. జీవితంలో తరచుగా నిరాశానిస్పృహలు పొందు తుంటాము. ఇవన్నీ జీవితంలో మన మెదుర్కొనే చీకటి సన్నివేశాలు.
పరలోకము కేవలము తేజోమయము. దేవు డిచ్చటనే యుండును. "దేవుడు వెలుగై యున్నాడు; ఆయనయందు చీకటి ఎంతమాత్రమును లేదు" (1 యోహాను 1:5). అతని వెలుగులో నిండైన అవగాహన, పరి పూర్ణమైన విజ్ఞానములుండును. కడచిన కాలము, విషయము లన్నియు విస్పష్టముగా నుండును. దేవునిచే రక్షింపబడినవారా వెల్గును చూతురు. దుష్కార్యపరులు చీకటినే ప్రేమింతురు (యోహాను 3:19-21). ఈ వెలు గులో తండ్రికి, అతనితో నుండువారికి పరిపూర్ణమైన సహచారిత్వ ముండును.
పరలోకము "పరిశుద్ధులకు సంక్రమించిన తేజోమయమైన సొత్తు" గా వర్ణింపబడినది (కొలొస్సీయులకు 1:12). విజ్ఞానము, పవిత్రత, ఆనం దము ఈ తేజస్సు లక్షణములుగా మతగ్రంథములు పేర్కొనుచున్నవి.
పరలోకము భయరహితము, పాపరహితము
"గొఱ్ఱెపిల్లయొక్క జీవగ్రంథమందు వ్రాయబడినవారే దానిలో ప్రవే శింతురు గాని నిషిద్ధమైనదేదైనను, అసహ్యమైనదానిని, అబద్ధమైన దానిని జరిగించువాడైనను అఒదులో ప్రవేశింపనే ప్రవేశింపడు" (ప్రకటన 21:27). నిరుత్సుకత, అసంతృప్తి, వ్యామోహము, పాపము - ఇవి ఈ భూలోకజీవితమందుండును గాని ఆ అందమైన పరలోకము నెప్పుడూ ప్రవేశింపనేరవు.
"అతడు వారికన్నుల ప్రతిబాష్పబిందువును తుడుచివేయును. మరణము ఇక ఉండదు, దుఃఖమైనను, ఏడ్పైనను, వేదనయైనను ఇక ఉండదు, మునుపటి సంగతులు గతించిపోయినవి" - అని ప్రకటన 21:4 చెప్పుచున్నది. క్రైస్తవునకు పరలోకము సంతృప్తికరమైన అంతిమ గమ్యము. భూలోకములో దేవు డతని కన్నీటిని తుడిచినప్పటికీ, సమస్త మైన శోకము ఆ పరలోకపు పవిత్రతలోనే తొలగింపబడునని అతనికి తెలుసు.
రక్షితుని అమృతత్వము
ఇహలోకములో అన్యోన్యసంబంధముల ప్రాధాన్యత మనకున్నది. పరస్పరానందములు, విచారములు మన మనస్సుల కంటుకొనును. సంసారబాంధవ్యములు అర్థవంతములు, కుటుంబవియోగము బాధా కరము. ఇవన్నీ మరణశీలమైన మన మనుగడకు అవసరమై యున్నవి.
యేసు క్రీస్తు తీర్పు నిచ్చేందుకు తిరిగివచ్చినప్పుడు అందరూ మారిపోతారు. చనిపోయినవారు తిరిగి లేస్తారు, మరణశీలులైనవారు మరణరహితులౌతారు. పాపపంకిలమై మరణశీలమైన దేహము అతని దేహమువలె వెలుగును. "సమస్తమును తనకు లోబరచుకొనజాలిన శక్తిని బట్టి ఆయన మన దీనశరీరమును తన మహిమగల శరీరమునకు సమ రూపముగల దానిగా మార్చును" (ఫిలిప్పీయులకు 3:21).
ఈ స్థితిలో మన సంసారబాంధవ్యములు మునుపటివలె మన కర్థ వంతములుగా దోచవు. పరలోకములో వివాహబాంధవ్య ముండదని యేసుక్రీస్తు చెప్పెను (మత్తయి 22:30). దేవుని సమక్షములో మనకుండే ఆనందము ముందు ఈ లోకములో మనకున్న వ్యామోహము లెంతో తీసికట్టుగా నుండును. రక్షితులైనవారికి, దేవుని గొఱ్ఱెపిల్లకు మధ్యగల సంబంధము నెట్టి శక్తియూ మచ్చపరుపజాలదు.
సాధువులు మరణశీలమైన కన్నులెన్నడూ గాంచని విషయము లను కనగలరు.; మరణశీలమైన చెవులెన్నడూ వినని శబ్దములను విన గలరు; మరణశీలమైన హృదయము లెన్నడూ ఊహించని విషయ ముల నూహించగలరు.
యేసు క్రీస్తు, అతని అభీష్టములే సుప్రశస్తము లగును
ప్రభువైన యేసు భూలోకవాసులందరికి కనపడు కాలము వచ్చు చున్నది. అప్పుడందరూ ఎదుట నిలచి అతనిచే విచారింపబడుదురు. (మత్తయి 25:31-34). ఈ లోకములో నిరాకరింపబడి, నిరసింపబడిన వారైనను, అతని నిజమైన అనుచరులు మహిమాన్వితులౌదురు (పర లోకమున). వారచ్చట నిరంతరముగా దేవునిమహిమను స్తోత్రము చేయ సమర్థులగుదురు. అచ్చట మృత్యువునకు బదులు అమృతత్వము నెల కొనును. "క్షయమైన యీ శరీరము అక్షయతను ధరించుకొనవలసి యున్నది. ఈ క్షయమైనది అక్షయతను ధరించుకొనినప్పుడు - విజయమందు మరణము మ్రింగివేయబడెను అని వ్రాయబడిన వాక్యము నెరవేరును" (1 కొరింథీయులకు 15:54, 2 కొరింథీయులకు 5:1 ను కూడ చూచునది).
సాధువు లీ జీవితములో అనేకములగు సంకటములు, వ్యామోహ ములు, కష్టముల నెదుర్కొందురు. ఉద్ధారకునియందు విశ్వాసముంచి చివరివరకు కొనసాగినవారిని అతని అనుగ్రహము పరలోకమునకు గొనిపోవును. అతనిని విశ్వసించిన అన్ని దేశములవారు, అన్ని భాషల వారు, అన్ని వయస్సులవారు అచ్చట నుందురు. పాపములనుండి క్షమింపబడి, యేసుక్రీస్తు రక్తముచే పరిశుద్ధులైనవారి అసంఖ్యాకమైన గొప్ప బృందము ఈ పరలోకమునందు వసించును (ప్రకటన 7:9-14).
ఈ జీవితములో క్షమింపబడిన ఆత్మలు పరలోకములో సుప్రశస్తము లగును. ఈ ఆత్మలు దేవుని గొఱ్ఱెపిల్లతో వియ్యమందుట ఎంత అద్భు తముగనుండును! ఈ మహిమ అనన్యసామాన్యము (ప్రకటన19:7-9).
పరలోకం - మానవులకు ఊహాతీతం
"ఇప్పుడు అద్దములో చూచినట్లు సూచనగా చూచుచున్నాము; అప్పుడు ముఖాముఖిగా చూతుము. ఇప్పుడు కొంతమట్టుకే యెరిగి యున్నాను; అప్పుడు నేను పూర్తిగా ఎదుగబడిన ప్రకారము పూర్తిగా ఎరుగుదును" (1 కొరింథీయులకు 13:12).
పరలోకముయొక్క మహత్వవైభవములు పూర్తిగా అవగాహన చేసికొనుటకుగాని, వర్ణించుటకుగాని వీలుపడదు. మనము చూచిన దానిని, అనుభవించినదానిని మాత్రమే మన మనసులు గుర్తించును. ఆత్మ దేవునితోసహా నివసించే లోకమే పరలోకమని మనం గుర్తించి నప్పటికీ, ఆ శాశ్వతనిలయంయొక్క పరిపూర్ణలక్షణాలను అతడు మనకు తెలియజేయుట లేదు.
పరలోకముయొక్క ఈషద్దర్శనములు మతగ్రంథములలో కొద్దిగా పేర్కొనబడియున్నవి. తొట్టతొలిగా ప్రాణత్యాగముచేసిన స్టెఫెన్ అను క్రైస్తవుడు, తన మతవిశ్వాసానికై రాళ్లతో గొట్టబడుచూ "ఆకాశమువైపు నికరముగా దృష్టి నిల్పి, దేవుని మహిమను, యేసు దేవుని కుడిపార్శ్వ మందు నిల్చియుండుటను చూచెను" (అపోస్తలుల కార్యములు 7:55). స్టెఫెన్ పరిశుద్ధాత్మతో నింపబడి, తన భవిష్యనిలయముయొక్క ఈష ద్దర్శనమును పొందెను.
పరలోకమునుగురించి ఎక్కువగా తెలియకున్నను, మనకు తెలిసి నంత మేరకు, ముందలి తరములందలి విశ్వాసపరులవలె మనమూ భగవన్నిర్మితమైన ఆ శాశ్వతనగరములో నుండ నిచ్చగింతుము. "దేవుడు దేనికి శిల్పయు, నిర్మాణకుడునై యున్నాడో పునాదులుగల ఆ పట్టణముకొరకు అబ్రాహీము ఎదురుచూచుచుండెను" (హెబ్రీయు లకు 11:10, 11:13-16 లను కూడ చూచునది).
మన మక్కడ ఉందుమా?
మరణానంతరము మన మెక్కడికి పోదుము? పరలోమునకు పోదుమా? దైవాత్మ మనలను మెల్లగా తట్టి అట్టి శాశ్వతభవిష్యత్తుకు సిద్ధపడమని గుర్తుచేస్తుంటుంది.
మనం దేవునియొక్క ఆవశ్యకతను గుర్తించవలెను. తన ఆదిమ పతనంవల్ల మానవుడు దేవుని అనుగ్రహమును కోల్పోయెను. మన పాప ములకు పశ్చాత్తాపపడి, క్రీస్తురక్తముద్వారా క్షమింపబడి మన మా దైవ సంబంధమును పునరుద్ధరించుకొనవచ్చును. అప్పుడు దేవుడు మనలను విజాయితీపరులుగా గ్రహించి, క్షమించును. ఇట్లు మనము వాక్కు ద్వారా, ఆత్మద్వారా దేవునిబిడ్డల మగుదుము. (యోహాను 3:5, 1:12). ఇట్లు మనము పొందు శాంతి మునుముందు మనము శాశ్వతలోకములో పొందెడు పరిపూర్ణశాంతికి తొలిరుచిగా నుండును. పరలోకములో తనకై యొక సౌధము సిద్ధపరుచబడినదని ప్రతియొక్కడు తన హృదయంలో స్పష్టమైన సాక్ష్యాధారమును కల్గియుండవచ్చును(యోహాను 14:23).