ప్రార్ధించుట మాకు నేర్పుము

మీ దేశాన్ని నడిపించే నాయకునితో మీరు ఎలా మాట్లాడాలను కుంటున్నారు?.లేక వేరొక ప్రసిద్ధుడైన వ్యక్తీ తో ఎలా మాట్లాడాలనుకుంటున్నారు?.లేక అతను మీ గృహములో ఎలా వుండాలని ఆశిస్తారు? మనలో చాలామందికి ఈ అవకాశం రాదు.కానీ ఈ ఇరువురు కంటే చాల ప్రాముఖ్యమైన వ్యక్తితో మీరు మాట్లాడగలరు అని తెలుసా?అంతకంటే ఎక్కువైన విషయం ఏమిటంటే అతను మీ గృహములో ఉంటాడు.

బహుశా పరలోకమందున్న మన తండ్రి అయిన దేవుని గూర్చి మాట్లాడుతున్నామని ఇప్పటికే మీకు తెలిసేవుంటుంది.అవును యిది నిజమే మనమందరం ఆయనతో మాట్లాడాలని ఆయన ఆశిస్తున్నాడు.మన యొక్క కృతజ్ఞతల తోనూ,విన్నపాలతో మరియు నిరాశ,నిస్పృహలతో ఆయన యొద్దకు రావచ్చు.ఇదియే ప్రార్ధన.

ఒకవేళ మీరు ప్రార్ధన చేసి ఉండవచ్చు.అయితే అదెలా అనిపించింది?నీలో అనేక ప్రశ్నలు మిగిలిపోయాయా?నికీలాగు అనిపించిఉండుంటే,అపోస్తులులు,కూడా ప్రార్ధించడం ఎలాగో మాకు నేర్పమని యేసు క్రీస్తును అడిగినప్పటి నుండి ఇది సాధారణమైన విషయమే.

దీని పూర్తి వచనం: ప్రార్ధించుట మాకు నేర్పుము

మొట్టమొదటి సారి ప్రార్ధన చేసినపుడు లేని దానితో మాట్లాడినట్లుగా క్రొత్తగా అనిపించినట్లు అనేక మంది భావిస్తారు.మీరు ఇలాగే నమ్మాలని సాతానుడు కోరుకుంటాడు ఎందుకంటే మీరు మరల ప్రార్ధన చేయకూడదని ఆశిస్తాడు.అయితే బైబిలు మనకు దృఢపరచు సత్యం మనం ఏ ఘడియలోనైనా ,మీరెవరైనా దేవుడు మీ యొక్క నిజవిన్నపాన్ని ఆలకిస్తాడు.”ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యమేదనగా,ఆయన చిత్తనుసారముగా మనమేది అడిగినను ఆయన మన మనవి ఆలకించుననునదియే.”(1యోహాను 5:14).

నేనెవరికి ప్రార్ధన చేయాలి? అనే ప్రశ్నను మీకు మీరే వేసుకుని ఉండవచ్చు.ఒకవేళ మీ యొక్క కుమారుడు ఒక అవసరతలో ఉన్నాడనుకుందాం.ఆ అవసరత నిమిత్తం అతడు ఎవరిని సహాయము అడగాలని మీరు ఆశిస్తారు? ఆ సహాయము మిమ్మల్నే అతడు అడగాలని మీరు ఆశించడం సత్యమే కదా? అవును,దేవుడు కూడా ఇలానే ఆశిస్తాడు.ఆయన మనకు మంచి ఈవులను యిస్తాడు.అన్నికంటే ముఖ్యంగా పాపక్షమాపణను మరియు నిత్య జీవితమును గూర్చిన నిరీక్షణను అనుగ్రహిస్తాడు.మనం మన విన్నపాలను ఆయన యొద్దకు తీసుకురావాలి.”నీ తండ్రికి ప్రార్ధన చేయుము “ అని ఒకసారి యేసు క్రీస్తు చెప్పాడు.(మత్తయి6:6).”పరలోకమందున్న మా తండ్రి .......... “ అని ప్రార్ధన ప్రారంభము అవుతుంది. “పరలోకమందున్న మన తండ్రితో మనం నేరుగా మాట్లాడవచ్చని బైబిలు మనకు బోధిస్తున్నది.

కొంత మంది “ కానీ ఏ మాటలు చెప్పాలో తెలియదు లేక నా గురించి దేవునికి ఏం చెప్పాలో తెలియదు “ అంటారు.ఇలా మనం ఎందుకు చేబుతామంటే దేవుడు మన ప్రార్ధన వినాలంటే ప్రత్యేకమైన పదాలు ఉపయోగించాలనుకుంటాము.మనం చాలా మాటలు పలుకులు అందమైనవిధానంలో ప్రార్ధిస్తే దేవుడు తన దృష్టిని మన వైపు త్రిప్పుతాడు అని భావిస్తాము.వాస్తవానికి చాలా సరళంగా,కొద్ది మాటలతో ఉండి దేవుడు అంగీకరించిన ప్రార్ధనలను గురుంచి బైబిల్ కొన్ని ఉదాహరణలు బోధిస్తున్నది.” దేవా బీద పాపిని అయిన నన్ను కరుణించుము “ (లూకా 18:13) అని పాపి అయిన ఒక మనుష్యుడు ప్రార్ధించాడు.వేరొక విరిగి నలిగిన పాపి ఇలా ప్రార్ధించాడు “ ప్రభువా నీవు నీ రాజ్యములో ప్రవేశించినపుడు నన్ను జ్ఞాపకము చేసుకో “(లూకా23:42),దేవుడు ఒక ప్రత్యేకమైన రూపం కలిగిన మాటల ప్రార్ధనను ఆశించడు.వివిధ మూలల నుండి వచ్చిన ఒకే రకంగా లేని అనేక మంది ప్రార్ధనలు బైబులు నందు కలవు.

అనేక మంది ప్రజలు ఏదో దేవుని నుండి పొందాలని ఆశించి,అది పొందలేక పోయి నిరుత్సాహపడుతున్నారు.ఏదేమైనా వారు దేనిని ఆశించారు?అనేక సార్లు మనకు మంచి చేయనివాటిని కావాలని మనం కోరుకుంటాం.ఎందుకంటే మన దృష్టి చాలా పరిమితం కాబట్టి ఈ రోజు కొరకు ఏం కావాలో అంతవరకే మనం చూడగలం.ఉదాహరణకు మూడు సంవత్సరాల బిడ్డ ఒక పదునైన కత్తి కావాలంటే తల్లి ఆ బిడ్డకు ఇవ్వడం వివేకమైన పనేనా?

దేవుని యొక్క కృప వలన మాత్రమే ఆయన సన్నిధిలోకి మనం వెళ్ళగలము కాబట్టి ప్రార్ధనలో మన వైఖరి ఎలా ఉండాలి ?అన్నింటికన్నా ఆయన ముందర మనల్ని మనం తగ్గించుకోవాలి .హృదయపూర్వకముగా ప్రార్ధనలో మనం ఖచ్చితంగా ఆయనకు లొంగిపోవాలి.తండ్రికి నేరుగా ప్రార్ధన చేసి మీ భావాలను,అవసరాలను నిబద్ధతతో వినమ్రంగా తెలియజేయాలి.ఆయన నీ విన్నపము అలకించాడని నమ్ము.మనం యేసు నామములో ప్రార్ధన చేయాలి.ఎందుకంటె ఆయనిలా చెప్పాడు,” మీరు నా నామమున దేనినడుగుదురోతండ్రి కుమారుని యందు మహిమ పరచబడుటకై దానిని చేతును .”(యోహాను 14:13).

తరచుగా ప్రార్దించుడి మీరు బైబిల్ బోధించు విధానములో ప్రార్ధన చేస్తే దేవుని గూర్చి ఎక్కువగా నేర్చుకుని అనేక ఆశీర్వాదాలను పొందుతారు.మీకు బైబిల్ ఉన్నట్లయితే ఈ ముఖ్యమైన అంశాన్ని చదవండి.మత్తయి6:5-13 మరియు మత్తయి7:7-11 నుండి ప్రారంభించండి.

మమ్మల్ని సంప్రదించండి

కర పత్రాలను ఆర్థరు చేయండి.